Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:42 AM

వడ్డెరలకు రాజకీయ అవకాశం దక్కుతుందా?

వడ్డెరలకు రాజకీయ అవకాశం దక్కుతుందా?

 వడ్డెరలకు రాజకీయ అవకాశం దక్కుతుందా?
January 24, 2026 11:12 AM 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తిరుమలగిరిలో కాంగ్రెస్ నిర్ణయాలపై వడ్డెరల ఆగ్రహం

స్థానికం ప్రధాన ప్రతినిధి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తొండ తిరుమలగిరి మున్సిపాలిటీలో వడ్డెరల రాజకీయ ఆశలు మరోసారి నిరాశగా మారుతున్నాయా అన్న ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అణగారిన వర్గాల పక్షాన నిలుస్తున్నామంటూ ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై వడ్డెర సమాజంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.తిరుమలగిరి మున్సిపాలిటీలో మొత్తం పదిహేను వార్డులు ఉండగా, ఎస్సీ–ఎస్టీలకు ఐదు సీట్లు కేటాయించారు. మిగిలిన వాటిలో బీసీలకు ఐదు సీట్లు, ఐదు సీట్లు జనరల్ కేటగిరీలోకి వెళ్లాయి. రెండవ వార్డు బీసీ జనరల్ కింద ఉండటం గమనార్హం.ఈ రెండవ వార్డులో బీసీ–ఏ వర్గానికి చెందిన వడ్డెర కుటుంబం కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం అహర్నిశలు పనిచేసింది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి ఈ కుటుంబం చేసిన కృషి అందరికీ తెలిసిందే. తమ ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చి, జెండాలు, కరపత్రాలు, బ్యాడ్జీలు, టోపీలు వంటి ఎన్నికల సామగ్రిని నిల్వ చేసి, నియోజకవర్గం అంతటా ప్రచారానికి తోడ్పడ్డారు.అయినా సరే, రెండవ వార్డు టికెట్‌ను తిరుమలగిరి మార్కెట్ కమిటీ ఛైర్మన్ భర్తకే ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకే కుటుంబానికి పదవులు కట్టబెట్టడం ప్రజా ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధమనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.రెండవ వార్డులో సుమారు తొమ్మిది వందల ఓట్లు ఉండగా, వాటిలో దాదాపు రెండు వందల అరవై ఓట్లు వడ్డెరలవే. సర్వేల ప్రకారం గెలుపు అవకాశాలు వడ్డెర కుటుంబానికే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. అలాంటప్పుడు పదిఓట్లు కూడా లేని వారికి టికెట్ ఇవ్వాలనే ఆలోచన వెనుక కారణాలేమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వడ్డెరల ఓట్లు ముప్పై లక్షలకు పైగా ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ముప్పైవేల ఓట్లు, తిరుమలగిరిలోనే సుమారు వెయ్యి ఐదు వందల మంది వడ్డెర ఓటర్లు ఉన్నారు. పదిహేను వార్డుల్లో ఒక్క సీటు కూడా వడ్డెరలకు కేటాయించలేకపోవడం అన్యాయమని వడ్డెర సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.తుంగతుర్తి ఎన్నికల సమయంలో వడ్డెర యువకులు వాహన అనుమతులు, ప్రచార ఏర్పాట్ల కోసం చేసిన కృషిని కాంగ్రెస్ నాయకత్వం మరిచిపోయిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అవసరం ఉన్నప్పుడు వడ్డెరలు గుర్తొస్తారు, అవకాశాల విషయానికి వచ్చేసరికి మాత్రం పక్కకు నెట్టేస్తారా అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వడ్డెరలకు రాజకీయ అవకాశాలు తెలంగాణలో లేవా?

వడ్డెరలు ఎప్పటికీ బండలు కొట్టే బతుకులకే పరిమితమవ్వాలా?

సంచార జాతిగానే మిగిలిపోవాలా?

బతికినంతకాలం ఓటర్లుగానే మిగిలిపోవాలా?

దేశ స్వాతంత్ర్య పోరాటంలో వడ్డెరల పాత్రను, దేశ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని విస్మరించవద్దని వడ్డెర సమాజం డిమాండ్ చేస్తోంది. అణగారిన వర్గాల పక్షాన నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే, తిరుమలగిరి రెండవ వార్డులో వడ్డెర కుటుంబానికి టికెట్ ఇవ్వాల్సిందేనని స్పష్టంగా హెచ్చరిస్తోంది.

మీ స్పందన? 8 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News