వడ్డేఓబన్న విగ్రహావిష్కరణ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు :-ఆంజనేయులు
వడ్డేఓబన్న విగ్రహావిష్కరణ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు :-ఆంజనేయులు
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలోని వడ్డే ఓబన్న సర్కిల్లో ఆదివారం రోజున తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు దేవల్ల మురళి, సామకోటి ఆదినారాయణ, జిల్లా వడ్డెర సాధికారిత కమిటీ కన్వీనర్ పల్లపు రవీంద్ర, వడ్డెర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్, ఓడిసి వడ్డెర సేవా సంఘం మండల అధ్యక్షుడు ఇడగుట్ట ఆంజనేయులు తదితరులు జిల్లా టిడిపి కార్యాలయం పుట్టపర్తిలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....
వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు చేసేందుకు వడ్డెర సోదరులు ఎన్నో సవాళ్లు, ఆటుపోట్లు ఎదుర్కొని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ ఒలిపి శ్రీనివాసులు కమిటీకి అధికారులతో, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో సమన్వయం చేసుకొని భూమి పూజ చేసిన చోటే విగ్రహం ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా అండగా ఉండి ప్రధాన భూమిక పోషించారు. వడ్డే ఓబన్న విగ్రహం తొలగించాల్సిందేఅని నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులు ఒత్తిళ్లకు గురిచేసిన ఒలిపి శ్రీనివాసులు, పల్లపు రవీంద్రలు ఉండగా నిలిచారు. వడ్డే ఓబన్న విగ్రహం తొలగించే సమస్య లేదు ఎంతవరకైనా పోరాడుతాం అంటూ న్యాయస్థానానికి వెళ్లి వడ్డెర్ల ఆడపడుచు, హైకోర్టు న్యాయవాది వేముల బేబీ రాణి గారు స్టే తీసుకురావడం జరిగింది. రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శులు ఎల్ఐసి నరసింహులు, జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి హనుమప్ప, రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు సంజీవరాయుడు, బీసీ రమణ, ఓర్సు వీరభాస్కర్, డాబా గంగయ్య, తాడిపత్రి శ్రీరాములు, రామాంజనేయులు తదితరులు వెన్నుంటే ఉండి వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి లక్ష రూపాయలు విరాళం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణలో పాలుపంచుకున్న విగ్రహ దాత డేరంగుల రవీంద్ర కల్పన దంపతులు, అన్నదాత బత్తల శ్రీనివాసులు, టైల్స్ దాత కుంచపు వీరభద్ర తో పాటు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. వడ్డెర్ల ఆత్మగౌరవం చాటుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులకు శ్రీనివాసులు, దండగల చెన్నకేశవులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మస్తానమ్మ, ఆవుల గంగులప్ప, ఆర్టీసీ డ్రైవర్ కుంచపు జయచంద్ర, అడ్వకేట్ మంజునాథ్, కుంచపు విజయ్ కుమార్, డేరంగుల చలపతి, గోగుల వెంకటనారాయణ, జెరిపిటి వెంకటనారాయణ, దండగల వెంకటేశులు, పూజారి రంగనాయకులు, దామోదర్, బ్యాంకు శీనా, విడగొట్ట వీరాంజనేయులు, మల్లెల ఆంజనేయులు, పందిబోటు వెంకటేష్, వైభవి ఆంజనేయులు, చంద్ర, సుమన్ టీవి రాజు, నవాబు కోట నాగరాజు, జెరిపిటి వెంకటేష్తో పాటు వడ్డెర కుల బంధువులకు అభినందనలు తెలియజేసుకుంటున్నామన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి