Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:38 PM

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్

27-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్ చేతులమీదుగా పురస్కారం

స్థానికం ప్రధాన ప్రతినిధి

భువనగిరిలో ఘనంగా గణతంత్ర వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో విశేష సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు చేతులమీదుగా ఆయనకు ఈ పురస్కారం అందజేశారు.77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం భువనగిరి జూనియర్ కాలేజీ మైదానంలో జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖల్లో అంకితభావంతో సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందికి అవార్డులు, పురస్కార పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారి ఆకాంక్ష్ యాదవ్ పాల్గొన్నారు.అవార్డు అందుకున్న ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిబద్ధతతో పని చేసిన తన సేవలను జిల్లా అధికారులు గుర్తించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి బాధ్యతను నిజాయితీతో నిర్వర్తించడమే తన లక్ష్యమని తెలిపారు. కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తానని స్పష్టం చేశారు.

Sthanikam

ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News