Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్

25-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ ఆగ్రహం

మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్

హుజూర్‌నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి

సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని రాజకీయంగా వేడెక్కించాయి. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆందోళనతో పట్టణం ఉద్రిక్తంగా మారింది.యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ పిలుపుతో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో ఇందిరాగాంధీ చౌక్‌కు చేరుకుని మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ‘ఉత్తమ్ జోలికొస్తే ఖబడ్దార్’, ‘మల్లయ్య యాదవ్ వెనక్కి తగ్గాలి’ అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కుక్కడపు మహేష్ మాట్లాడుతూ.. ప్రజల మనిషిగా, అభివృద్ధికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మల్లయ్య యాదవ్‌కు లేదని మండిపడ్డారు. రాజకీయంగా ఉనికిని కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే కేవలం ప్రచారం కోసమే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇకపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గానీ, కాంగ్రెస్ నాయకత్వంపై గానీ నోరు పారేసుకుంటే నియోజకవర్గంలో తిరగనివ్వబోమని తీవ్రంగా హెచ్చరించారు. మల్లయ్య యాదవ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సైదులు నాయక్, హుజూర్‌నగర్ మండల అధ్యక్షుడు శీలం చిరంజీవి, గరిడేపల్లి మండల అధ్యక్షుడు నకిరేకంటి సతీష్, హుజూర్‌నగర్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లచ్చమల్ల హరీష్, చింతలపాలెం మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు చెన్నగాని వెంకన్న, కోశాధికారి జగన్, గరిడేపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు అశోక్, బంటు సైదులు, కందుల వినోద్, దాసు గోపి, రంగ, నాగరాజు, యల్లావుల మహేష్, కందుల సాయి కుమార్, గుండు గోపి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉత్తమ్ జోలికొస్తే ఊరుకోం. మల్లయ్య యాదవ్ ఖబడ్దార్.కుక్కడపు మహేష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News