Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు

13-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

20, 21న ఎంపీడీవో కార్యాలయాల ముందు ధర్నాలు

చౌటుప్పల్:

ఉపాధి హామీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 20, 21 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల ఎంపీడీవో కార్యాలయాల ముందు నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.

సోమవారం చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం, మండల కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, కొత్తగా తీసుకొచ్చిన జీ-రాంజి చట్టంతో కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని విమర్శించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలకు సరైన వేతనం అందకపోవడం, పనికి వెళ్లినా డబ్బులు రావడం లేదని, పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు కూడా లేవని ఆరోపించారు. నీడ, తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్లు, బీమా వంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవైసీ పేరుతో కూలీలను పనికి దూరం చేస్తున్నారని, ఈ కొత్త విధానం పేదలను ఉపాధి నుంచి దూరం చేసే ప్రయత్నమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు.

పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలంటే అందరూ ఐక్యంగా, సంఘటితంగా ఈ ధర్నాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మికులను కోరారు.

ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు అధ్యక్షత వహించగా, మానే సాలయ్య, యాట బాలరాజు, నేరడి మహేష్, జంగం అంజయ్య, గువ్వల చంద్రయ్య, నీల శ్రీను, కొంతం శ్రీనివాస్ రెడ్డి, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దకొండూరు గ్రామానికి చెందిన పలువురు కార్మికులు కూడా హాజరయ్యారు.

Sthanikam

ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై ఆందోళన పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News