Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:06 PM

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి

16-01-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను గ్రామీణ ప్రజలు సమైక్యంగా తిప్పికొట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.

జనంపల్లి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ—కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాలపై భారాన్ని మోపి కేంద్ర ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. చట్టం పేరును సైతం మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి, ఆర్థిక భద్రత, ఆత్మగౌరవం కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వేమవరపు సుధీర్ బాబు మాట్లాడుతూ—సంక్రాంతి సందర్భంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మహిళల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని అన్నారు.

Sthanikam

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను గ్రామీణ ప్రజలు తిప్పికొట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News