Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

21-05-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ, : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద నిర్వహించిన కూలీల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గిస్తూ చట్టాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు.

కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం వాటా చెల్లించాల్సి రావడం వల్ల కూలీలకు పనులు దొరకకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిస్థలాల్లో రెండుసార్లు ఫోటోలు తీసే విధానం కూలీలను అవమానించేలా ఉందన్నారు.

సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకూలీని రూ.600కు పెంచాలని, పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో భీమనబోయిన జంగయ్య, మద్దెల శంకరయ్య, జక్కల అంజయ్య, చేగురి నర్సింహ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి ‘విబిజీ రామ్‌జీ’ చట్టాన్ని రద్దు చేయాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News