Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:47 PM

ఉన్నత విద్యా గ్రంథాలయాలు నాలెడ్జ్ సెంటర్లుగా మారాలి

ఉన్నత విద్యా గ్రంథాలయాలు నాలెడ్జ్ సెంటర్లుగా మారాలి

ఉన్నత విద్యా గ్రంథాలయాలు నాలెడ్జ్ సెంటర్లుగా మారాలి
January 08, 2026 08:38 PM 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిజిటలైజేషన్‌తో అకాడమిక్ లైబ్రరీలకు నూతన దిశ: ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హనుమకొండ: ఉన్నత విద్యా సంస్థల గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలుగా కాకుండా, విజ్ఞాన భాండాగారాలుగా — నాలెడ్జ్ సెంటర్లుగా రూపాంతరం చెందాలని ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఆనంద్ కిషోర్ స్పష్టం చేశారు. డిజిటలైజేషన్‌ను సమర్థవంతంగా వినియోగించుకుంటే గ్రంథాలయాలు విస్తృతమైన పాఠక లోకాన్ని ఆకర్షించగలవని ఆయన పేర్కొన్నారు.

పింగిళి ప్రభుత్వ డిగ్రీ పీజీ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి), హనుమకొండలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE), హైదరాబాద్ మరియు పీఎం ఉష (PM-USHA) సహకారంతో లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. “డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ – నావిగేటింగ్ ఛాలెంజెస్, లెవెరేజింగ్ అపార్టునిటీస్” అంశంపై జరుగుతున్న ఈ సదస్సు ఆధునిక గ్రంథాలయాల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోందని ఆయన అన్నారు.ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్. లక్ష్మణ రావు కీలకోపన్యాసం చేస్తూ, ఆధునిక సాంకేతికతతో సమన్వయమైన డిజిటల్ గ్రంథాలయాలు పాఠకులకు మరింత చేరువ కావాలని సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ సుదర్శన్ రావు ఖచ్చితమైన సమాచారానికి గ్రంథాలయాలే ప్రామాణిక వేదికలని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం. మధుసూదన్ మాట్లాడుతూ డిజిటలైజేషన్‌తో లైబ్రరీలు పునరుజ్జీవనం పొందుతున్నాయని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ఈ జాతీయ సదస్సు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండటంతో పాటు ఆధునిక గ్రంథాలయాల ప్రాధాన్యతను విస్తృతంగా చాటుతోందని పేర్కొన్నారు. సెమినార్ కన్వీనర్ డా. బి. యుగంధర్ సదస్సు లక్ష్యాలు, ఉద్దేశ్యాలను వివరించారు. వందకు పైగా పరిశోధనా పత్రాలు అందడం గర్వకారణమని తెలిపారు.ఈ సందర్భంగా 75 పరిశోధనా పత్రాలతో కూడిన సావనీర్‌ను, 41 పూర్తి పరిశోధనా పత్రాలతో కూడిన జర్నల్‌ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు టెక్నికల్ సెషన్లలో తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News