Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:52 PM

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్

21-01-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉద్యోగుల ఐక్యతే జిల్లా ప్రగతికి బలం

డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణలో అదనపు కలెక్టర్ వ్యాఖ్యలు

యాదాద్రి భువనగిరి, స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నూతన డైరీ–2026, క్యాలెండర్‌ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాను రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని ప్రశంసించారు. జేఏసీ చైర్మెన్ మందడి ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగులు ఒకే తాటిపై నిలిచి ఐక్యంగా ముందుకు సాగడం జిల్లాకు బలమని పేర్కొన్నారు. ఈ ఐక్యత కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మందడి ఉపేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో కృష్ణా రెడ్డి, చౌటుప్పల్ ఆర్డీవో వి. శేఖర్ రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, టీజీవో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ప్రసాద్, తెలంగాణ నాన్‌గెజిటెడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు ధరణికోట భగత్, ట్రెసా, పంచాయతీ కార్యదర్శుల సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, టీజీవో, టీఎన్జీవో సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యోగుల సంఘం డైరీ–2026, క్యాలెండర్ ఆవిష్కరణ. అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News