Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:39 AM

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టిడిపి నిరసన
January 30, 2026 09:11 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోనిలో ప్రత్యేక పూజలు, ఖండన కార్యక్రమం

ఆదోని,

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జరిగిన కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఘాటుగా స్పందించింది. మాజీ శాసనసభ్యులు, ఆదోని టిడిపి ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఖండన కార్యక్రమం నిర్వహించారు.

ఆదోని నియోజకవర్గం తిరుమల్ నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ కల్తీ మహా కుంభకోణాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఘోరమైన కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు పరిధిలోనే బయటపడటం దురదృష్టకరమన్నారు. పాల లేకుండా నెయ్యి తయారు చేయడం, నెయ్యిలో కల్తీ కలపడం, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేయడం వంటి విషయాలు సిట్ దర్యాప్తు, చార్జిషీట్ల ద్వారా స్పష్టమయ్యాయని తెలిపారు.టీటీడీ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, కల్తీకి రహదారి వేసిన వైసీపీ పాలకులు ఎటువంటి సరైన విచారణ లేకుండా అనుమానాస్పద సంస్థలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో సుమారు రూ.235 కోట్ల శ్రీవారి నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు.

తప్పు చేయలేదని చెప్పేవారు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి అంశంపై ఎవరూ మాట్లాడకూడదని కోర్టు ఆదేశాలు ఎందుకు తెచ్చుకున్నారని, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి ఎందుకు నిరాకరించారంటూ నిలదీశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా, అందులో సుమారు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేయడం మహాపాపమని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News