Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:53 AM

తెలుగు భాషా వికాసంపై ఎన్‌జీ కళాశాలలో జాతీయ సదస్సు

19-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నల్లగొండ:

తెలుగు భాషా వికాసంలో చోటుచేసుకుంటున్న మార్పులు, విభిన్న దృక్పథాలపై చర్చించేందుకు నాగార్జున ప్రభుత్వ కళాశాల వేదిక సిద్ధమైంది. కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో జనవరి 30న “తెలుగు భాషా వికాసం – వివిధ వైఖరులు” అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగాధ్యక్షుడు డా. వెల్దోడి శ్రీధర్ తెలిపారు.ఈ సందర్భంగా సోమవారం సదస్సు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్స్ డా. పరంగి రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, తెలుగు అధ్యాపకులు పాల్గొన్నారు.

తెలుగు భాష పరిణామ క్రమం, ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక డిజిటల్ యుగం వరకు భాషలో వచ్చిన మార్పులు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో తెలుగు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులో లోతైన విశ్లేషణ జరగనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు, కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు.ప్రధానంగా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, కృత్రిమ మేధ (AI) యుగంలో తెలుగు భాష వినియోగం, సాంకేతిక రంగంలో తెలుగు అవకాశాలపై చర్చ జరగనుంది. అలాగే తెలుగు నేలపై ఉన్న వివిధ మాండలికాల అస్తిత్వం, తెలంగాణ మాండలిక భాషా సౌరభం, సాహిత్య వికాసం, ఆధునిక సాహిత్యంలో కొత్త ధోరణులు, విమర్శనాత్మక దృక్పథాలపై పరిశోధనా పత్రాలు ఉండనున్నాయి. మారుతున్న విద్యా విధానంలో తెలుగు బోధనకుఅవలంబించాల్సిన నూతన పద్ధతులపై కూడా ప్రముఖ విద్యావేత్తలు ప్రసంగించనున్నారు.తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కళాశాల తెలుగు విభాగం కోరింది. సదస్సులో పాల్గొనే ప్రతినిధులు ఈ నెల 29లోపు పూర్తి పరిశోధనా పత్రాన్ని telugungc2022@gmail.com కు పంపించాలని సూచించారు. నమోదు రుసుము ఆచార్యులకు రూ.1000, పరిశోధకులకు రూ.500గా నిర్ణయించారు. ఇతర వివరాలకు 9866977741 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.

Sthanikam

తెలుగు భాషా వికాసంపై ఎన్‌జీ కళాశాలలో జాతీయ సదస్సు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News