Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:51 PM

త్వరలో బిఆర్ఏఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం : డాక్టర్ బి. ధర్మ నాయక్

23-01-2026 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండ : స్థానికం ప్రధాన ప్రతినిధిడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పది అధ్యయన కేంద్రాలలో డిగ్రీ, పీజీ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు బిఆర్ఏఓయూ పూర్వ విద్యార్థుల నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు.నల్లగొండ ప్రాంతీయ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఘంటా చక్రపాణి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజనులు, ఆదివాసీలకు ఉచితంగా లేదా అతి తక్కువ ఫీజుతో ఉన్నత విద్య అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.విద్యార్థులకు ఉపకార వేతనాల విధానాన్ని అమలు చేస్తూ, చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నూతన కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ విశ్వవిద్యాలయం నుంచి పది లక్షల మందికి పైగా విద్యార్థులు పట్టాలు పొందినట్లు గుర్తు చేశారు. విశ్వవిద్యాలయాన్ని పూర్తిస్థాయి డిజిటల్ విధానంలోకి తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రవేశ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో అమలు చేస్తున్నట్లు వివరించారు.త్వరలో నిర్వహించబోయే ఉమ్మడి నల్లగొండ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఉపకులపతి ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అలాగే అకడమిక్ డైరెక్టర్ పప్ప చక్రపాణి, రిజిస్ట్రార్ విజయ్ కృష్ణారెడ్డి, ఎల్ఎస్ఎస్టీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలునిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని పూర్వ విద్యార్థుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ బొజ్జ, మహిళా డిగ్రీ కళాశాల సమన్వయకర్త డాక్టర్ రాజారామ్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు సైదాబాబు, ఉపాధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Sthanikam

త్వరలో బిఆర్ఏఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం : డాక్టర్ బి. ధర్మ నాయక్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News