Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:00 PM

తాటి చెట్టు కింద పడిన గీత కార్మికుడు… రోడ్డున పడిన కుటుంబం

18-01-2026 910 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు వీరమల్ల శంకరయ్య (తండ్రి పాపయ్య) తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ కాలు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.వృత్తి నిమిత్తం తాటి చెట్టును ఎక్కిన సమయంలో మధ్యలో సమతుల్యత కోల్పోయి కింద పడటంతో తలకు, కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే శంకరయ్యను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నల్లగొండ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం శంకరయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న గీత కార్మికుడికి ప్రమాదం జరగడంతో ఆయన కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో జీవిస్తున్న ఈ కుటుంబం ఒక్కసారిగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడినట్టయ్యింది.ప్రమాదంలో గాయపడ్డ శంకరయ్య కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గ్రామస్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. గీత కార్మికులకు రక్షణ చర్యలు, బీమా సదుపాయాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు.

Sthanikam

తాటి చెట్టు కింద పడిన గీత కార్మికుడు… రోడ్డున పడిన కుటుంబం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News