Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:24 PM

తాటి చెట్టు ప్రమాదం.. చేయూత కోసం ఎదురుచూపు

29-01-2026 371 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన పాలకూరి నర్సింహా (58) తాటి చెట్టు ఎక్కుతుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. జనవరి 27 సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం అతని కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. గాయపడిన నర్సింహాను వెంటనే నల్లగొండలోని స్కంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేదరికం మధ్య జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి గతంలోనే గాఢమైన విషాదం ఎదురైంది. చిన్న వయస్సులోనే చెట్టు ఎక్కి పడి కుమారుడు మృతి చెందగా, ప్రస్తుతం ఒక్క కుమార్తె మాత్రమే కుటుంబానికి ఆధారం. భార్య లక్షమ్మ కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ ఇంటి పనులకే పరిమితమైంది.

కుటుంబ పోషణ భారం మొత్తం నర్సింహాపైనే ఉంది. ఒకవైపు కౌలుకు వ్యవసాయం చేస్తూ, మరోవైపు తాటి చెట్లు ఎక్కి కళ్లను తీసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నడుపుతున్నాడు. తాటి చెట్టునే జీవనాధారంగా చేసుకున్న వ్యక్తి ప్రమాదానికి గురికావడంతో ఆసుపత్రి ఖర్చులు తీరని భారంగా మారాయి.సమాజానికి శ్రమను అంకితం చేసిన ఒక కష్టజీవి ఈ పరిస్థితిలో చేయూత కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రమాదంలో పడిన ఒక వ్యక్తికి సహాయం చేయడం మాత్రమే కాదు, కష్టకాలంలో ఒక కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత సమాజంపై ఉంది. ఈ తరుణంలో నర్సింహా కుటుంబానికి మన వంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా మారింది.

సహాయం చేయదలచిన వారు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా

95735 69772 నంబర్‌కు పంపవచ్చని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

తాటి చెట్టు ప్రమాదం.. చేయూత కోసం ఎదురుచూపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News