Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

09-01-2026 363 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్ స్థానికం ప్రధాన ప్రతినిధి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఘనంగా జరిగింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలు సూచించారు.పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి మేడీ రవిచంద్ర కూడా సమావేశంలో పాల్గొని కీలక అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు.
Sthanikam

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News