Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:17 PM

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!
18-01-2026 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం స్థానికం ప్రధాన ప్రతినిధి

అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు, సంప్రదాయ ఆతిథ్యంతో కూడిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనంగా తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు.

మంత్రి ఆహ్వానంతో జరిగిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ నేటివిటీ సీఎం మనసు దోచుకుంది. “భోజనం అదిరింది… ఆతిథ్యం మెరిసింది” అన్నట్టుగా సాగిన విందులో ప్రతి వంటకం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.తెలంగాణ స్టైల్లో వండిన నాటుకోడి పులుసు, రొయ్యల ఇగురు, చేపల కూర, మటన్ ఫ్రై, ప్రత్యేక రుచితో చేసిన మటన్ కీమా సహా దాదాపు 17 రకాల వంటకాలతో సీఎంకు రాజభోజనం వడ్డించారు. సీఎం ఈ వంటకాలను ఆసక్తిగా రుచి చూశారు.ఈ విందును మంత్రి సతీమణి పొంగులేటి మాధురి స్వయంగా పర్యవేక్షిస్తూ సంప్రదాయ రుచులు తగ్గకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.మాంసాహారంతో పాటు జొన్న రొట్టెలు, వెజ్ పలావ్, క్యారెట్–కొబ్బరి ఇగురు, పచ్చిమిర్చి పచ్చడి వంటి శాఖాహార వంటకాలు కూడా సీఎంను విశేషంగా ఆకట్టుకున్నాయి.భోజనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, చేనేత పెయింటింగ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బహూకరించారు.

Sthanikam

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News