Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:47 PM

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల విద్యకు బలమైన పునాది వేసిన ప్రీ ప్రైమరీ పాఠశాల

19-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ పరిధిలోని అల్లాపూర్ గ్రామపంచాయతీ మల్పరేగడి తండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రీ ప్రైమరీ పాఠశాలను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంనుంచి తొలి దశలో 210 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరగతులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ఉంటాయని వివరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటలు, పాటలు, పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చిన్న వయసులోనే విద్యకు బలమైన పునాది వేయడం ద్వారా పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్య పొందాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడటమే కాకుండా గ్రామీణ చిన్నారుల భవిష్యత్తును వెలిగిస్తుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, విద్య రంగంలో మరిన్ని చర్యలు తీసుకొని ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తహేర్ అలీ, మాజీ ఎంపీటీసీ పండరి రెడ్డి, అల్లాపూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి, ఉప సర్పంచ్ రామ్ శెట్టి, గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల విద్యకు బలమైన పునాది వేసిన ప్రీ ప్రైమరీ పాఠశాల

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News