Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:21 PM

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

13-04-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణ సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వస్తుందని హెచ్చరించారు.అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ట్రాఫిక్ సిఐ విజయ మోహన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదని, ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు. మలుపుల వద్ద, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 9వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ట్రాఫిక్ నిబంధనలు పాటించి.. ప్రాణాలు కాపాడుకోవాలి: చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్

Article Image

చౌటుప్పల్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు ప్రయాణ సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తనతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వస్తుందని హెచ్చరించారు.అతివేగంగా వాహనాలు నడపడం వల్ల అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణ పాటించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్, ట్రాఫిక్ సిఐ విజయ మోహన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు అనేవి కేవలం జరిమానాల కోసం కాదని, ప్రజల భద్రత కోసమేనని స్పష్టం చేశారు. మలుపుల వద్ద, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్ దేప రమ్య రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 9వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News