Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:33 AM

స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలి

13-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్నికల నియమావళిపై అధికారులకు అదనపు కలెక్టర్ సూచనలు

భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి పాత్ర కీలకమని, ఎన్నికల విధులను పకడ్బందీగా, సమన్వయంతో నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల విధులు, బాధ్యతలు, నియమ నిబంధనలపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…

మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అధికారులు తమకు అందజేసిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతి అంశంపై స్పష్టత సాధించాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు.

మాస్టర్ ట్రైనర్లు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో తలెత్తే సందేహాలు, అపోహలను ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాల ప్రకటన వరకు చేపట్టాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు చెక్‌లిస్ట్ రూపొందించుకోవాలని తెలిపారు.

నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ వంటి అన్ని దశలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Sthanikam

స్వేచ్ఛాయుత, పారదర్శక వాతావరణంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News