Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్

12-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి యువత బాధ్యతతో ముందుకు రావాలని చైతన్య భారతి ఫౌండేషన్ చైర్మెన్ ఆరుట్ల సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. దృఢచిత్తంతో, దేశాభివృద్ధి లక్ష్యంగా యువత పునరంకితమవ్వాల్సిన అవసరం ఉందన్నారు.స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని చైతన్య భారతి ఫౌండేషన్, వివేకానంద యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సరూర్ నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్‌లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచ వేదికపై చాటిన మహానుభావుడు స్వామి వివేకానందుడన్నారు. తన ప్రసంగాలు, బోధనలతో యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తిప్రదాతగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించడమే స్వామి వివేకానంద ఆశయమని తెలిపారు. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే దేశానికి సుస్థిర భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, తెలంగాణ ప్రాంత గోసేవ ప్రముఖ్ ఎస్.వి. నివాస్, జీ ఆరోగ్య విద్యా బోదన్ శ్రీరామ్ సుధాకర్, అనూప్ రాజా, మల్లారెడ్డి, శివకుమార్, వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు గందె రాజ్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు వందనపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుస్థిర భవిష్యత్తు కోసం యువత నడుం బిగించాలి – ఆరుట్ల సురేష్ కుమార్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News