Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:53 AM

సూర్యాపేటలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

06-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పార్టీ జెండా ఆవిష్కరణ – దేశాభివృద్ధికి పార్టీ కృషి కొనసాగుతుందని నాయకుల వ్యాఖ్యలు

సూర్యాపేట పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి వేగవంతమైందని, ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవ స్థానం సంపాదించుకుందని అన్నారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, అవినీతి రహితంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుత పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల ప్రజల నమ్మకం తగ్గిందని వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సమన్వయకర్త కర్నాటి కిషన్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా నాయకులు సలిగంటి వీరేందర్, బూర మల్సూర్ గౌడ్, మండల అధ్యక్షుడు సంధ్యాల సైదులు, మాజీ కౌన్సిలర్లు రంగినేని లక్ష్మణరావు, గోగుల రమేష్, జిల్లా నాయకులు సలిగంటి శ్రీనివాస్, గట్ల ఉమేష్, సిరిపంగి ప్రసాద్, గిలకత్తుల కరుణాకర్, యార్లగడ్డ రామారావు, బండపల్లి శ్రీనివాస్, చెన్నబోయిన రాజేష్, ఎలుగూరి రామ్మూర్తి, కోడి లింగయ్య, సంగు కరుణాకర్, రాపోలు ఉపేందర్, గుడిసె వెంకటేష్, రంగినేని రేహిత్, జనార్దన్ రెడ్డి, పుల్లారెడ్డి, మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షుడు షేక్ సలీం పాషా, జిల్లా మహిళా నాయకురాలు తాడూరి జ్యోతి, గుండు కల్పన, వీరవెల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News