Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:14 AM

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముప్పై పోలీస్ చట్టం అమలు

01-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలీసు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలకు నిషేధం

సూర్యాపేట

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ముప్పై పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి అంతరాయం కలిగించే సమావేశాలు, జన సమూహాలు పూర్తిగా నిషేధమని తెలిపారు.అదేవిధంగా సామాజిక మాధ్యమాలలో అనవసరమైన విషయాలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ముప్పై పోలీస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.బాణసంచా కాల్చడం, డీజేలు వినియోగించడం కూడా పూర్తిగా నిషేధమని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Sthanikam

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ముప్పై పోలీస్ చట్టం అమలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News