Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:05 PM

సంక్రాంతి వేళ గ్రామంలో క్రీడల సందడి… ఘనంగా బహుమతుల ప్రదానం

17-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామంలో వాలీబాల్, క్రికెట్ క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ పోటీలు గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించాయి.

వాలీబాల్ పోటీల్లో ప్రథమ బహుమతి విజేతలుగా నిలిచిన 7 హిల్స్ జట్టు సభ్యులకు రూ.5,000 నగదు బహుమతి తో పాటు షీల్డ్ అందజేశారు. ద్వితీయ బహుమతి పొందిన శ్రీ చత్రపతి శివాజీ యూత్ జట్టుకు రూ.2,500 నగదు బహుమతి, షీల్డ్ ప్రదానం చేశారు.

అదేవిధంగా క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన గల్లి బాయ్స్ యూత్ జట్టుకు రూ.10,000 నగదు బహుమతి, షీల్డ్ అందజేయగా, ద్వితీయ స్థానంలో నిలిచిన శ్రీ చత్రపతి శివాజీ యూత్ జట్టుకు రూ.5,000 నగదు బహుమతి, షీల్డ్ అందజేశారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కందిమళ్ళ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఇటీవల హాకీ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికైన గ్రామ విద్యార్థి నోముల సాయి కుమార్ కు ప్రోత్సాహకంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కందిమళ్ళ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ…“గ్రామ యువత క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి. భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. యువతకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి” అని భరోసా ఇచ్చారు.

Sthanikam

సంక్రాంతి వేళ గ్రామంలో క్రీడల సందడి… ఘనంగా బహుమతుల ప్రదానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News