Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:52 PM

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

23-01-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని యాదాద్రి జిల్లా మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యా సంస్థల సంఘం జిల్లా సమన్వయాధికారి మాధవి వెల్లడించారు.

గత నెల 11వ తేదీన ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఇప్పటివరకు లక్షా రెండు వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. పొడిగించిన గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీ కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తులు అన్నీ https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతులు, సాధారణ సంక్షేమ నివాస విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 22వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

Sthanikam

సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News