Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

సంగమేశ్వర ఆలయంలో శాసనసభ్యుల దంపతులతో ఘనంగా మాఘ అమావాస్య వేడుకలు

Updated : 18 Jan 2026 20:22 IST
As Preferred Source 1 min read
సంగమేశ్వర ఆలయంలో శాసనసభ్యుల దంపతులతో ఘనంగా మాఘ అమావాస్య వేడుకలు

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో కొలువైన అతిపురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ సంగమేశ్వర దేవస్థానంలో మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.ఈ పవిత్ర సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు పట్లోల అనుపమ సంజీవరెడ్డి దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.మాఘ అమావాస్య సందర్భంగా మంజీర నదిలో నిర్వహించిన పుణ్యస్నాన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సంగమేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమ పూజలు, గంగా హారతి వంటి కార్యక్రమాలను భక్తి భావంతో నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి కృప నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంగమేశ్వర స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, యువతకు మంచి భవిష్యత్తు లభించాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామాలు, మండలాలు అభివృద్ధి చెందుతూ ప్రజలందరికీ శ్రేయస్సు కలగాలని స్వామివారిని మనస్పూర్తిగా కోరుకున్నారు.మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా అలంకరించగా, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనంతో పుణ్యఫలాలు పొందారు.ఆలయ పరిసరాలు భక్తుల జయఘోషలతో మార్మోగాయి.ఈ కార్యక్రమంలో బోరంచ గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో సంగమేశ్వర దేవస్థానం ప్రాంతం ప్రత్యేక శోభను సంతరించుకుంది.

Sthanikam

సంగమేశ్వర ఆలయంలో శాసనసభ్యుల దంపతులతో ఘనంగా మాఘ అమావాస్య వేడుకలు

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news