Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:33 PM

సిరిపురంలో కోతుల పట్టివేత.గ్రామానికి ఊరట..!

27-01-2026 631 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

సొంత ఖర్చులతో 100 కోతులు అడవులకు తరలింపు

రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా గ్రామ సర్పంచ్ కీలక చర్యలు చేపట్టారు. గ్రామస్తుల విజ్ఞప్తుల మేరకు తన సొంత ఖర్చులతో సుమారు వంద కోతులను సోమవారం పట్టివేసి అడవుల్లోకి తరలించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలు, ఇళ్లపై దాడులు, నిత్యజీవితానికి ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో సమస్యను దశలవారీగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కోతుల పట్టివేత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పట్టుకున్న కోతులను సురక్షితంగా శ్రీశైలం అడవుల్లో విడిచిపెట్టనున్నట్టు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మూడుదూడ్ల రమేష్ అనూష, నాయకులు బండ శ్రీనివాస్ రెడ్డి, కూనూరు ముత్తయ్య, వార్డు సభ్యులు సూర్యకళ, గాద శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేష్, పగడాల లక్ష్మి తదితరులు పాల్గొని సహకరించారు. సర్పంచ్ చర్యపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Sthanikam

సిరిపురంలో కోతుల పట్టివేత.గ్రామానికి ఊరట..!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News