Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:56 PM

సిర్గాపూర్‌లో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహణ

09-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :

సిర్గాపూర్ గ్రామంలో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా,ఉల్లాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పటిల్ హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలలో చురుకుగా పాల్గొని గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ ర్యాలీలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్గాపూర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరం శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు క్రీడా స్పూర్తిని ప్రతిబింబించే నినాదాలు చేస్తూ ర్యాలీని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి నడుచుతూ వారికి ప్రోత్సాహం అందించారు.గ్రామ ప్రజలు, యువత, క్రీడాభిమానులు ర్యాలీకి ఘన స్వాగతం పలకడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగుతూ ప్రజల్లో క్రీడల పట్ల అవగాహన పెంచింది. అనంతరం గ్రామపంచాయతీ ప్రాంగణంలో ర్యాలీ ముగిసింది.ఈ కార్యక్రమం ద్వారా యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరిగిందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sthanikam

సిర్గాపూర్‌లో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News