Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 04:00 AM

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి
17-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : LB Nagar,Dilsuknagar,Vanastalipuram,Hayatnagar
AJAY

హైదరాబాద్ స్టానికం ప్రతినిధి

సికింద్రాబాద్:

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం భారత్ రాష్ట్ర సమితి (BRS) చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ర్యాలీగా ముందుకు కదులుతున్న BRS శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

అనంతరం ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ సమయంలో పలువురు BRS కార్యకర్తలు స్వల్ప గాయాలు పాలయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందన్న ఆందోళనతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు.

Sthanikam

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News