Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:06 PM

శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి – బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్

శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి – బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్

శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి – బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్
January 20, 2026 06:55 AM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ ఏవీయూ నల్లగొండ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్ అన్నారు.ఆదివారం నల్లగొండలోని రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఎన్జీ కళాశాల స్టడీ సెంటర్‌తో పాటు ఇతర అధ్యయన కేంద్రాల్లో తరగతుల నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి విధిగా తరగతులకు హాజరై, కౌన్సిలర్లు బోధించే పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు తప్పనిసరిగా అసైన్‌మెంట్లు సమర్పించాల్సి ఉంటుందని, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం విద్యార్థుల మొబైల్ ఫోన్‌లు, ఈమెయిల్ ఐడీలకు అందుతుందని తెలిపారు. అకాడమిక్ అంశాలపై అవగాహన పెంచేందుకు ఫోన్-ఇన్ కార్యక్రమాల ద్వారా కూడా మార్గనిర్దేశం చేస్తున్నామని చెప్పారు.వర్సిటీ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలకు నల్లగొండలోని రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్‌ను లేదా 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News