Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

షార్ట్‌సర్క్యూట్‌తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం

23-05-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోర్లు, హెచ్‌డీ పైపులు అగ్నికి ఆహుతి

రామన్నపేట, మండలంలోని వెల్లంకి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రమాదంలో పశువుల కోసం నిల్వ ఉంచిన గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

రైతులు నీల శేఖర్, పోలు జితేందర్‌రెడ్డి తమ 20 ఎకరాల భూమిలో ఆవులు, గేదెల కోసం సుమారు 600 గడ్డి కట్టలు నిల్వ ఉంచగా అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. అలాగే పోలు వెంకట్‌రెడ్డికి చెందిన మరో 600 గడ్డి కట్టలు, ఒక బోరు, సుమారు 600 మీటర్ల హెచ్‌డీ పైపులు కూడా పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయకపోవడం వల్లే షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని రైతులు ఆరోపించారు. ఘటనపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

సమస్య తెలిసిన వెంటనే తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్‌ఐ శోభ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

షార్ట్‌సర్క్యూట్‌తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News