Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:31 AM

సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మృతి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

23-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఎం సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. కొమ్మయిగూడెం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు బెల్లి మల్లయ్య, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన పాలకూరి నర్సింహ అనారోగ్యంతో మృతి చెందగా, సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జహంగీర్‌తో పాటు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు గ్రామాల్లో ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టిన ఉద్యమాలకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకులుగా గుర్తింపు పొందారని తెలిపారు.

బెల్లి మల్లయ్య రావణపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా, శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. పాలకూరి నర్సింహ కందాల రంగారెడ్డి సారథ్యంలో శోభనాద్రిపురం గ్రామంలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తూ చివరి వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని కొనియాడారు.

ఏకకాలంలో ఇద్దరు నిబద్ధత కలిగిన కామ్రేడ్స్‌ను కోల్పోవడం బాధాకరమని, వారి ఆశయస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జల్లెల పెంటయ్య, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, కూరెళ్ల నర్సింహాచారి, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, నాగటి ఉపేందర్, ఎండీ రషీద్, బొడిగే రజిత, నీల ఐలయ్య, గంటెపాక శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మృతి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News