Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుడ్డేకల్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు ఓబీ నాగరాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, సమానత్వం, లౌకికత వంటి మూల్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకగానే కాకుండా రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టే దినంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఈ నెల 30న విజయవాడలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ నిరుద్యోగి రణభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకన్న, సీపీఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు కె. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్, నాయకులు షేక్షావలి, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News