Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

సీనియర్ సీఆర్‌పీ వ్యూహంతో సమాఖ్యలకు కొత్త ఊపిరి

30-01-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో బలోపేతమైన మండల సమాఖ్యలు

గ్రామీణ పేదల అభివృద్ధే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ వ్యూహం విజయవంతంగా అమలైంది. జిల్లాలోని ఆరుగురు అనుభవజ్ఞులైన సీఆర్‌పీలు మూడు బృందాలుగా విడిపోయి 17 మండల సమాఖ్యలను విస్తృతంగా సందర్శించి రెండు రోజులపాటు లోతైన శిక్షణ అందించారు.మండల సమాఖ్యల ఆర్థిక నిర్వహణ, ఖాతాల నిర్వహణ, ఆడిట్ విధానాలు, పాలనా ప్రక్రియలు, నిర్ణయాధికార వ్యవస్థలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. దీంతో సమాఖ్యల పనితీరులో పారదర్శకత పెరగడంతో పాటు సంస్థాగత సామర్థ్యం మరింత బలపడిందని అధికారులు వెల్లడించారు.శిక్షణ అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శిక్షణ అనుభవాలు, ఎదురైన సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ భీమయ్య, అదనపు డీఆర్‌డీఓ కె. జంగారెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె. రేణుకతో పాటు మండల సమాఖ్యల అధ్యక్షులు,అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఆర్‌డీఓ టి. నాగిరెడ్డి మాట్లాడుతూ, మండల సమాఖ్యలు ఆర్థికంగా స్వావలంబన సాధించి పాలనలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. శిక్షణలో పొందిన అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు.

ఈ వ్యూహంతో మండల సమాఖ్యల నిర్వహణలో గణనీయమైన మార్పు రానుందని, గ్రామీణ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

Sthanikam

సీనియర్ సీఆర్‌పీ వ్యూహంతో సమాఖ్యలకు కొత్త ఊపిరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News