Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:11 PM

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం
24-01-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కంచనపల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

సేంద్రియ వ్యవసాయమే సమాజానికి దిశానిర్దేశకమని చాటి చెప్పేలా కంచనపల్లి గ్రామంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ ఎన్జీ ప్రభుత్వ కళాశాల (స్వ) జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వాలంటీర్లు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుదాం, నేలమ్మ తల్లిని కాపాడుకుందాం, సేంద్రియ సాగుతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి పాల్గొని, సేంద్రియ వ్యవసాయం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. వాలంటీర్లు గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేంద్రియ ఎరువుల ప్రయోజనాలను వివరించారు. దీనికి స్పందించిన గ్రామ ప్రజలు తమ అనుభవాలను పంచుకున్నారు.మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెల్లండి శ్రీధర్ గారు సేంద్రియ ఎరువుల వినియోగంతో నాణ్యమైన పంట చేతికొస్తుందని, రసాయనాల వాడకం వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచనపల్లి పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రామకృష్ణ గారు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

Sthanikam

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News