Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:39 PM

స్వేచ్ఛాయుత, శాంతియుత మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

27-01-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధికార యంత్రాంగం పూర్తిస్థాయి సిద్ధతలో ఉండాలి:

హైదరాబాద్:స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, శాంతియుత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు.మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో వెబ్‌కాస్టింగ్‌కు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో మున్సిపల్ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని, విధుల్లో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాధ్యతగా పని చేయాలని స్పష్టం చేశారు.రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎన్నికల విధులకు తగినంత సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశు యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్టీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

స్వేచ్ఛాయుత, శాంతియుత మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News