Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:29 AM

సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్‌కు జాతీయస్థాయి ఘనత

07-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

SHRESHTA ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 490

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

సూర్యాపేట జిల్లా సమీపంలోని చివ్వేంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఉన్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించింది.ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి కొప్పాకుల హర్ష, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన SHRESHTA–9వ తరగతి ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 490 సాధించి ఘన విజయాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో 490వ ర్యాంకు సాధించడం విశేషమని పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. శ్రీనివాస్ ఆనంద్ తెలిపారు.

ఈ విజయానికి పాఠశాల అందిస్తున్న నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన బోధనతో పాటు పూజ్య మంత్రస్వరూపదాస్ స్వామీజీ ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం ప్రధాన కారణాలని విద్యార్థి తల్లిదండ్రులు కొప్పాకుల శంకర్ పేర్కొన్నారు.విద్యార్థి హర్ష భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని పాఠశాలకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హార్దిక్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్‌కు జాతీయస్థాయి ఘనత

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News