Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

సామూహిక వివాహాలు ఆదర్శనీయం : ఎస్సై మహేష్ కుమార్

24-01-2026 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ఆదోని, జనవరి 24:కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఎస్సై మహేష్ కుమార్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు అండగా నిలిచే సామూహిక వివాహాల నిర్వహణ ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర గ్రామాల్లో అరుదుగా కనిపించే ఈ తరహా కార్యక్రమాలు సంతేకుడ్లూరు గ్రామంలో కొనసాగుతున్నాయంటే అది స్వామివారి అనుగ్రహమేనని కొనియాడారు.

గ్రామ ఐక్యతకు, సామాజిక సమరసతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. భక్తి, సేవ, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ బ్రహ్మోత్సవాలు నిలుస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

Sthanikam

సామూహిక వివాహాలు ఆదర్శనీయం : ఎస్సై మహేష్ కుమార్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News