Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:56 AM

సామాజిక కార్యకర్తలకు అంబేద్కర్ ఫోటోతో సత్కారం

19-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ, అంబేద్కర్ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలను మాల మహానాడు జిల్లా కమిటీ సోమవారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను అందజేసి వారికి గౌరవం ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల యాదగిరి మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ సిద్ధాంతాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రయత్నాలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దొంత సత్యనారాయణ, కంచి మల్లయ్య, బర్రె సుదర్శన్, కొడారి వెంకటేష్, బాకారం లావణ్య, బద్దుల సునీత, అఖిల తదితర సామాజిక కార్యకర్తలను అంబేద్కర్ ఫోటోతో సత్కరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

సామాజిక కార్యకర్తలకు అంబేద్కర్ ఫోటోతో సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News