Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:50 PM

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి

03-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహిళా విద్య, సామాజిక న్యాయానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

మహిళా విద్యకు మార్గదర్శకురాలైన మహానీయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో మహిళా విద్యకు తొలి వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల వివక్ష, లింగ అసమానతలు ప్రబలంగా ఉన్న కాలంలోనే విద్యనే ఆయుధంగా చేసుకుని సమాజ మార్పుకు ఆమె బాటలు వేసిందని అన్నారు. ఆడపిల్లల విద్య కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

వెనుకబడిన వర్గాలు, దళితులు, మహిళల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల పెద్దలు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఆమె జయంతి సందర్భంగా మహిళా విద్య, సామాజిక చైతన్యం, సమాన హక్కుల కోసం మరింతగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News