Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:20 PM

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

20-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి, అలాగే మోటకొండూర్ మండలం మాటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న మరో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ సీనియర్ అధికారులు ఎస్‌ఈ సురేష్, సీఈ బాలస్వామి, డీఈ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన ఉపకేంద్రాల ఏర్పాటుతో పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News