Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ

03-04-2026 335 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అక్కమహాదేవి ఆలయంలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ సదాశివపేట వారి ఆధ్వర్యంలో అక్కమహాదేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ అపర్ణ పాటిల్ పాల్గొని అక్కమహాదేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు. అనంతరం భక్తి గీతాలు, వచనాల పారాయణం నిర్వహించి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొల్పారు.సంఘ అధ్యక్షుడు గందిగా రాజు మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితమే సదాశివపేటలో అక్కమహాదేవి ఆలయం నిర్మించబడినట్లు తెలిపారు.అక్కమహాదేవి చూపిన భక్తి మార్గం, సమానత్వ భావన సమాజానికి ఆదర్శమని, స్త్రీ సాధికారతకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు అన్నపూర్ణతో పాటు వీరశైవ సమాజ మహిళలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత కూడా భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News