Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని

08-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి

సామాజిక మూఢనమ్మకాలను ధైర్యంగా ఎదురించి మహిళా విద్య, సామాజిక చైతన్యానికి బాటలు వేసిన ఆదర్శ మహిళ సావిత్రిబాయి ఫూలే అని మండల విద్యాధికారి జి. జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆధ్వర్యంలో రామన్నపేట ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి గణనీయమైన సేవలందించి సమాజ అభ్యున్నతికి అంకితమైన ధీర వనితగా ఫూలేను జిల్లా కార్యదర్శులు దొడ్డి స్వామి, కంచి రవికుమార్ కొనియాడారు.

అనంతరం మండల విద్యాధికారి చేతుల మీదుగా TSUTF నూతన విద్యా సంవత్సరం–2026 డైరీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని, కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేసేలా మార్పులు చేయాలని, పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు గాసీరాం, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, FWF మండల కన్వీనర్ మేడి మధుబాబు, సీనియర్ నాయకులు జగదీశ్వర చారి, జహంగీర్, కృష్ణయ్య, రాకేష్, ఎమ్మార్సీ సిబ్బంది శివకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News