Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తడ్కల్‌లో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. భారీ ర్యాలీలో పాల్గొన్న యువత, ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:29 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి – పలువురికి తీవ్ర గాయాలు

17-01-2026 736 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయులు ఈ ప్రమాదానికి గురయ్యారు.వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టడంతో ప్రమాదం తీవ్రతరమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.ప్రమాదంలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో రావులపల్లి హెడ్మాస్టర్‌తో పాటు మరో హెడ్మాస్టర్ తులసి ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా వారిని వెంటనే 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి – పలువురికి తీవ్ర గాయాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News