Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం

13-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో నిర్వహించిన “రోడ్డు భద్రత గ్రామసభ”లో సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరిస్తూ, వేగ నియంత్రణ పాటించాలని కోరారు.

ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుంచుకుని బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి అలవాట్లు ప్రాణాంతకమని హెచ్చరించారు.

రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా జాగ్రత్తగా చూసి దాటాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ సెక్రటరీ, వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహించబడింది.

Sthanikam

రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News