Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత:హెల్మెట్‌తో వాహనం నడిపిన వ్యక్తికి సీఐ ప్రశంసలు

19-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ప్రశంసనీయమైన చర్యలు చేపట్టారు.హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వాహనదారుడిని ఆపి, అతని బాధ్యతాయుతమైన ప్రవర్తనను అభినందించారు. వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు.ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు భద్రతపై మరింత శ్రద్ధ వహించి, తమ కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ ధరించడం ఒక చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత భద్రతకూ అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపిన వాహనదారుడు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రతకు ప్రాధాన్యత:హెల్మెట్‌తో వాహనం నడిపిన వ్యక్తికి సీఐ ప్రశంసలు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ప్రశంసనీయమైన చర్యలు చేపట్టారు.హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వాహనదారుడిని ఆపి, అతని బాధ్యతాయుతమైన ప్రవర్తనను అభినందించారు. వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు.ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు భద్రతపై మరింత శ్రద్ధ వహించి, తమ కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ ధరించడం ఒక చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత భద్రతకూ అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపిన వాహనదారుడు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News