ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ నియోజకవర్గ ఇంచార్జ్
పాలేరు నియోజకవర్గం: మలిదశ ఉద్యమకారుడు, పాలేరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ బత్తుల సోమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడగా తోటి ఉద్యమకారులు పరామర్శించారు. సోమవారం రోజున ఆయన తన సతీమణితో కలిసి కూసుమంచి శివాలయానికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనంతరం చికిత్స నిమిత్తం ఖమ్మంలోని భవాని హాస్పిటల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మండల పార్టీ అధ్యక్షుడు షేక్ రంజాన్, మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఉల్లోజ్ వెంకన్న, తోక వెంకటరెడ్డి తదితరులు ఆసుపత్రికి చేరుకొని సోమయ్యను పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని వారు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి