Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:35 AM

రంగమ్మగూడెంలో మహిళా సృజనోత్సవం – అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

రంగమ్మగూడెంలో మహిళా సృజనోత్సవం – అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

రంగమ్మగూడెంలో మహిళా సృజనోత్సవం – అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
January 16, 2026 02:16 PM 237 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగమ్మగూడెంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

స్థానిక ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు సభ్యుడు వంగాల అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ముగ్గుల పోటీలో విజేతలుగా

ఫస్ట్ ప్రైజ్ – మాండ్ర పూజ,

సెకండ్ ప్రైజ్ – మద్దెగళ్ల ఉమా,

థర్డ్ ప్రైజ్ – పల్సం సంతోష నిలిచారు. విజేతలకు వంగాల అవినాష్ తన వంతుగా ఆర్థిక సహాయంతో బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, రంగమ్మగూడెం మహిళలు మరింత చైతన్యవంతులుగా ఎదగాలని, రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంగార్డు శ్రీశైలం యాదవ్ హాజరై మహిళలను అభినందించారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముద్రబోయిన మల్లయ్య, వంగాల ఉపేందర్, ముద్రబోయిన ఆంజనేయులు, ముద్రబోయిన లింగస్వామి, మద్దెగళ్ల శీను, మద్దెగళ్ల ఉప్పలయ్యతో పాటు గ్రామ యువకులు, మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News