Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 01:55 PM

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం

24-02-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిన రెడ్ హౌస్‌లో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రతి ఏడాది నిర్వహించే ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ప్రముఖ నాయకులు మైనారిటీ ప్రతినిధులతో సమావేశమై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముస్లిం సోదరులతో మాట్లాడి, రంజాన్ మాసం పవిత్రతను కాపాడుతూ ఐక్యతా భావంతో ఇఫ్తార్ విందును విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మైనారిటీ సోదరులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం మరింత బలపడాలని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పట్టణ ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడు యం.డి. షఫీ ఉల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి తదితరులు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సందర్భంగా సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించేలా ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News