Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:34 PM

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

27-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్‌కు అంగన్వాడీ యూనియన్ వినతి

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

గత సంవత్సరం జూలై నెలలో రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం దురదృష్టకరమని, వెంటనే వాటిని చెల్లించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు బూరుగు స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలివేరు రమాకుమారి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనియన్ ఆధ్వర్యంలో అనేక దశల్లో సాగిన పోరాటాల ఫలితంగా రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. పదవీ విరమణ చేసిన మహిళా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాసరి పాండు, రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు అంజమ్మ, తులసమ్మ, లక్ష్మమ్మ, వరలక్ష్మీ, వెంకమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News