Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:14 AM

రాష్ట్ర సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్

09-01-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

కామారెడ్డిలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్‌లో మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి వి. శరణ్ తేజ్ ప్రతిభ చాటాడు. గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో చేసిన వినూత్న విజ్ఞాన ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు.

శరణ్ తేజ్ ప్రదర్శించిన ప్రాజెక్ట్ శాస్త్రీయ ఆలోచన, సామాజిక అవసరం కలగలిపిన విధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతుల మధ్య పోటీ ఉన్నప్పటికీ శరణ్ తేజ్ ప్రథమ స్థానంలో నిలిచి క్రిష్ణవేణి విద్యాసంస్థకు, మండలానికి గర్వకారణంగా నిలిచాడు.రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థి శరణ్ తేజ్‌ను, గైడ్ టీచర్ పి. మురళిని కామారెడ్డి ఎమ్మెల్యే కె. వెంకట రమణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, అధికారులు అభినందించి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి, ఉపాధ్యాయ బృందం శరణ్ తేజ్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

రాష్ట్ర సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థి శరణ్ తేజ్ స్టేట్ ఫస్ట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News